సాక్షి డిజిటల్ న్యూస్ 8 నవంబర్ 2025 రుద్రూర్ మండలం నిజామాబాద్ జిల్లా ( షేక్ గౌస్ సాక్షి డిజిటల్ న్యూస్ ప్రతినిధి ప్రతినిధి) రుద్రూర్ మండల కేంద్రంలోని బోయి సంఘంలో శుక్రవారం రోజు ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 వరకు వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని లైన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ శ్యాంసుందర్ పహాడే తెలియజేశారు. ఈ యొక్క వైద్య శిబిరంలో లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యులు మరియు దంత వైద్యులు పాల్గొని రోగులను పరీక్షించి అవసరమైన వారికి మందులు ఉచితంగా ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ యొక్క శిబిరంలో 126 మంది రోగులు వైద్య సేవలను అందుకున్నారని ఇందులో 32 మందికి ఆపరేషన్ అవసరం ఉన్నందున ఉచిత కంటి ఆపరేషన్ నిమిత్తము బోధన్ లయన్స్ కంటి ఆసుపత్రి వారికి రోగుల జాబితాను పంపించడం జరిగిందిని అన్నారు. ఇందులో అవసరమైన రోగులకు కంటి చుక్కల మందులు, టూత్ పేస్టులు, నొప్పుల మాత్రలు ఉచితంగా ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ అధ్యక్షులు లయన్ కె.వి మోహన్ మాట్లాడుతూ ఈరోజు జరిగిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని ఇందులో చాలామంది రోగులు హాజరై వారి యొక్క రోగాలకు చికిత్సలు అందుకోవడం జరిగింది అని ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన లయన్స్ కంటి ఆసుపత్రి బోధన్ వారికి దంత వైద్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రుద్రూర్ లైన్స్ క్లబ్ ఆఫ్ అధ్యక్షులు కే మోహన్,క్లబ్ కార్యదర్శి లయన్ గుండూరు ప్రశాంత్ గౌడ్, లయన్ గాండ్ల మధు,మంజరి సీతారాం, మంజరి రాజు, బోయి సంగం అధ్యక్షులు సాయిలు, లక్ష్మణ్, ఉరడి వీరయ్య తదితరులు పాలుగొన్నారు