సాక్షి డిజిటల్ న్యూస్ 8నవంబర్ 2025(జగిత్యాల జిల్లా ఇంచార్జ్)బోనగిరి మల్లారెడ్డి : పాల్గొన్న జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు బి రాజ గౌడ్ సామూహిక వందేమాతర గీతాలపన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత తెలిపారు.వందేమాతరం గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో సమీకృత జిల్లా కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన సామూహిక వందేమాతరం గీతాలాపన కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత,అదనపు కలెక్టర్, స్థానిక సంస్థల బి రాజ గౌడ్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ మాట్లాడుతూస్వాతంత్ర ఉద్యమంలో కోట్ల మంది భారతీయులకు స్పూర్తి నింపిన వందేమాతరం గేయానికి నేటీతో 150 ఏళ్లు పూర్తయ్యాయని అదనపు కలెక్టర్ తెలిపారు. వందేమాతరం గేయానికి 150 సంవత్సరాలు నిండిన నేపథ్యంలో భారత ప్రభుత్వం వందేమాతరం స్మారక నాణేన్ని విడుదల చేస్తుందని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలో సామూహికంగా వందేమాతరం గేయాన్ని ఆలపిస్తున్నట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పాలనాధికారి హకీమ్ జిల్లా అధికారులు,తదితరులు పాల్గొన్నారు.