పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ బొక్కా నాగేశ్వరరావు (నవంబర్ 8 2025 ) నందిగామలో సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామ పట్టణం మార్కెట్ యార్డు నందు పత్తి రైతుల ప్రయోజనార్థం సెంట్రల్ కాటన్ కార్పొరేషన్ (సిసిఐ) పత్తి కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ రైతులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ పత్తిని విక్రయించుకునేలా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులు చర్యలు తీసుకోవాలి. బయ్యర్లు మరియు మార్కెటింగ్ శాఖ అధికారులు రైతు పక్షాన పనిచేయాలి. ఎక్కడా అసౌకర్యం లేదా అసంతృప్తి కలగకుండా పత్తి కొనుగోలు జరగాలి,అని సూచించారు.బయ్యర్ బాల నరసింహ నాయక్ మరియు అసిస్టెంట్ డైరెక్టర్ (మార్కెటింగ్) రాజబాబు తో కలిసి కొనుగోలు ప్రక్రియను పరిశీలించిన ఆమె, 12 తేమ శాతం దాటి ఉన్న పత్తిని కూడా సిసిఐ ద్వారా కొనుగోలు చేయాలని సూచించారు. తాజాగా అకాల వర్షాలు, తుఫానుల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులుఎదుర్కొంటున్నారని గుర్తుచేసిన ఎమ్మెల్యే సౌమ్య కూటమి ప్రభుత్వంఎల్లప్పుడూ రైతు పక్షాన ఉంటుంది. రైతుల కష్టం వృథా కాకుండా వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం, అని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రైతులు, రైతు నాయకులు, మున్సిపల్ చైర్ పర్సన్ మండల కృష్ణకుమారి, మార్కెట్ కమిటీ అధికారులు,వ్యవసాయ శాఖ సిబ్బంది, కూటమి నాయకులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *