సాక్షి డిజిటల్ న్యూస్:6/11/2025 రిపోర్టర్ యాట కృష్ణ జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి శ్రీ శ్రీ బూగులోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ దర్శనానంతరం రవి పటేల్ మాట్లాడుతూ ఇక్కడ స్వయంభుగా నిలచిన శ్రీ భూగులోని వెంకటేశ్వర స్వామి అత్యంత భక్తిశ్రద్ధలతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు దర్శించుకుంటారు వారి కోరికలు నెరవేరాలని ఆడి పశువు సమృద్ధిగా ఉండాలని ప్రజలందరికీ వెంకటేశ్వర స్వామి దీవెనలు ఎల్లవేళలా ఉండాలని రవి పటేల్ ఆకాంక్షించారు ప్రకృతి అవనీయత ఒడిలో చిన్న పెద్ద తేడా లేకుండా గుట్టలు చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం ఆస్వాదిస్తూ ఆనందంగా ప్రజల మొక్కులు తీర్చుకుంటారు
రాష్ట్రవ్యాప్తంగా ఈ యొక్క క్షేత్రాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దాలి దగ్గరలో ఉన్న పాండవుల గుట్ట ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పేరు పొందినందున ఈ రెండు గుట్టలను నిత్యం ప్రజలు దర్శించుకునే విధంగా ప్రభుత్వాలు చొరవ తీసుకొని మంచి వసతులు కల్పిస్తూ పర్యాటక కేంద్రంగా మార్చడం వల్ల ప్రజలు ఆహ్లాదంగా తమ మొక్కులు చెల్లించుకుంటారు దర్శన కార్యక్రమంలో టి ఆర్ పి పార్టీ తిరుమలగిరి నాయకులు శ్రీకాంత్ ఆధ్వర్యంలో మరియు ఉషికే ఓదెలు అనంతుల సంపత్ పబ్బ వెంకన్న మోటపోతుల సమ్మయ్య నీలరపు రమేష్ బొజ్జ నాగరాజు తదితరులు పాల్గొన్నారు