సాక్షి డిజిటల్ న్యూస్: నవంబర్ 7 (ప్రకాశం జిల్లా బ్యూరో ఇంచార్జ్: షేక్ మక్బూల్ బాష). ప్రకాశం జిల్లా ఎస్పీ “వి.హర్షవర్ధన్ రాజు”ఆదేశాల మేరకు, జిల్లా సర్కిల్ ఇన్స్పెక్టర్లు క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో సర్కిల్ పరిధిలోని అన్ని యూఐ (అన్ ఐడెంట్ ఫైడ్) కేసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు, మరియు క్రైమ్ కంట్రోల్ వ్యూహాలు పై సమీక్ష చేపట్టారు. అధికారులు తమ పరిధిలో ఉన్న పెండింగ్ కేసులను విశ్లేషించి, వీటిని త్వరితగతిన పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే చట్టం అమలులో నిర్లక్ష్యం లేకుండా, కఠినంగా వ్యవహరించాలని సూచనలు అందించారు.ప్రకాశం జిల్లా పోలీసులు ప్రజా భద్రత, న్యాయం, మరియు చట్ట పరిరక్షణ పట్ల తమ కట్టుబాటును మరోసారి వ్యక్తం చేశారు