ఆలూరు, నవంబర్ 6, సాక్షి డిజిటల్ న్యూస్:- ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి శుక్రవారం ప్రజా గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి పిలుపునిచ్చారు. ఆలూరు నియోజకవర్గం కేంద్రం నందు టిడిపి ఇన్చార్జి వైకుంఠం జ్యోతి ఇంటి వద్ద శుక్రవారం గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై గ్రీవెన్స్ కార్యక్రమంలో అర్జీ రూపంలో అందిస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు.ప్రజలందరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.