తల్లాడ/నవంబర్ 07(సాక్షి డిజిటల్ న్యూస్ ) రైతులు వ్యవసాయం నుండి వెళ్లిపోయేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి సుదర్శన్ రావు, తల్లాడ వాసవి కళ్యాణ మండపంలో రైతు సంఘం మండల కార్యదర్శి నల్లమోతు అధ్యక్షతన సత్తుపల్లి డివిజన్ మహాసభ గురువారం నిర్వహించారు మాట్లాడుతూ, రైతులను వ్యవసాయం నుండి దూరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు, అమెరికా నుండి పత్తి గోధుమపాలు కోడిపంది మాంసాలు దిగుమతి అనుమతిస్తూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం స్వదేశీ వ్యవసాయానికి మంగళం పాడుతుందని ఆరోపించారు, రైతుల ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం బలమైన ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర ప్రభుత్వ విధానాలు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఏ నిబంధనలు పత్తి రైతులను దోస పెడుతున్నాయన్నారు ఎకరానికి ఏడుపుంతాల పరిమితి ఎనిమిదిలో ప్రేమ శాతం కిసాన్ కపాస్ రిజిస్ట్రేషన్ పత్తి రైతులను ముప్పు తిప్పలు పెడుతున్నాయని పత్తి కొనుగోలు నిరాకరణకై ప్రభుత్వం తీసుకొచ్చిన కఠిన నిబంధనలు ఎత్తివేసి ప్రభుత్వం ప్రకటించిన క్వింటాల్కు 8110 రూపాయలు మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అధిక వర్షాలతో పత్తి నాణ్యత దెబ్బతిన్నదని, ఒకవైపు దిగుబడి తగ్గి రైతు లబోదివో అంటుంటే సిసిఐ నిబంధనలు మద్దతు ధరలు లేకుండా పోయాయి అన్నారు అన్ని నిబంధనలు ఎత్తివేసి మద్దతు ధరకు ప్రభుత్వం పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా కౌలు రైతులు సాగులో ముఖ్యపాత్ర పోషిస్తున్నారని వారికి అవసరమైన సబ్సిడీలు బ్యాంకు రుణాలు ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు సాగు భూమి కలిగిన ప్రతి రైతుకు పట్టాదారు పాస్ పుస్తకం భూభారతలో భాగంగా అందజేయాల డిమాండ్ చేశారు పంటల ప్రణాళికల రూపొందించి అమలు చేయాలని కోరారు, సమస్యల పరిష్కారం కోసం రైతులు సంఘటితంగా పోరాడాల్సిన ఆవశ్యకత ఉందన్నారు, కార్యక్రమంలో, జిల్లా అధ్యక్షులు మాదినేని రమేష్, సీనియర్ నాయకులు తాత భాస్కరరావు, శీలం సత్యనారాయణ రెడ్డి, శీలం పకీరమ్మ, అయినాల రామలింగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు