సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 6 2025, అనంతగిరి మండల రిపోర్టర్ గరిడేపల్లి రమేష్ అనంతగిరి మండలంలోని బొజ్జగూడెం తండా గ్రామంలోనీ రేషన్ దుకాణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేపట్టిన రేషన్ సంచులను కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ధారావత్ సైదులు,కాంగ్రెస్ మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు ధారావత్ రాజీవ్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు సన్న బియ్యంతో పాటు జనపనారా చేతి సంచులు పంపిణి చేయడం సంతోషకరమని అన్నారు. ఒక్క రేషన్ కార్డుపై 25 కిలోల వరకు బియ్యం తీసుకొని వెళ్లే విధంగా వీటిని రూపొందిచారని పంపిణీలో పేర్కొన్నారు.లబ్ధిదారులకు ఇచ్చే సన్నబియ్యంతో పాటు పర్యావరణహిత సంచులు అందిచడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు.ప్రజా ప్రభుత్వం మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి,ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డిలు నిరుపేదల సంక్షేమం కోసమే పని చేస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమం గ్రామ పెద్దలు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.