గీత కార్మికుల కు చెల్లించాల్సిన 13 కోట్ల ఎక్స్గ్రేషియా బకాయిలు వెంటనే విడుదల చేయాలి

సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 07 యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం రిపోర్టర్ ముషం శ్రీనివాస్ మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని ఎక్సైజ్ ఆఫీసు ముందు మోత్కూర్ మండల గీత పని వారలసంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమానికి గీత పనివారల సంఘం జిల్లా అధ్యక్షుడు చాపల అంజయ్య పాల్గొని మాట్లాడుతూ గీత వృత్తిలో చనిపోయిన కుటుంబాలకు ఎక్స్గ్రేషన్ 5 లక్షల నుండి 10 లక్షల వరకు ఇవ్వాలని తాత్కాలికంగా గాయపడిన వారికి రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని మెడికల్ బోర్డు విధానం రద్దు చేయాలని ప్రభుత్వ సివిల్ సర్జన్ పర్యవేక్షణలో సర్టిఫికెట్లు అందజేయాలని ప్రతి సొసైటీకి టిఎఫ్టిలకు గ్రామాల పునాదిగా వన పెంపకాలకు 560 జీవో ప్రకారం ఐదు నుండి పది ఎకరాలు ఇచ్చి ప్రభుత్వ భూమిని ఇవ్వాలి వనపెంపకం మూసి గోదావరి నది సమీపంలో వన పెంపకం పెంచడం ద్వారా వృత్తి పర్యావరణం కాపాడుతుందని ప్రబోదవశాత్తు గీత కార్మికుడు చనిపోయినట్లయితే అతని భార్యకు వెంటనే పెన్షన్ ఇవ్వాలని గీత వృత్తిదారుల కుటుంబాలకు ప్రభుత్వ పథకాల ను వృత్తి పునాదిగా వర్తింపజేసి విద్యా వైద్య గృహ వసతి విదేశీ విద్యను అభ్యసించుటకు కావలసిన ఆర్థిక సహకారం అందించాలని బీసీ రిజర్వేషన్ 42 శాతం అమలు చేయాలని బడుగు బలహీన వర్గాల కోసం జీవితం అంకితం చేసిన ప్రఖ్యాత స్వాతంత్ర సమరయోధుడు మూడుసార్లు రెండుసార్లు పార్లమెంటు మెంబర్గా ఉండి దివంగతులైన శ్రీ కీర్తిశేషులు బొమ్మగాని ధర్మ బిక్షం జీవిత చరిత్రను పార్టీ అంశముగా పొందుపరచడం ట్యాంకు బండిపై లేదా ఆయన ప్రాతినిధ్యం వహించిన హైదరాబాదు నగరంలో కంచు విగ్రహం ఏర్పాటు చేయాలని జయంతి వర్ధంతులను ప్రభుత్వం నిర్వహించాలని బోనగిరి మండలం నందన గ్రామంలో నీరా పరిశ్రమను వెంటనే ఏర్పాటు చేయాలని చాపల అంజయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎక్సైజ్ సిఐ కి మెమోరాండం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో గీత పనివారలసంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు బత్తిని శ్రీను ఎడ్ల నరేష్ సొసైటీ అధ్యక్షులు బీసు సత్తయ్య పట్టణ అధ్యక్ష కార్యదర్శులు బీసు సత్యనారాయణ నిజ సంఘం జిల్లా నాయకులు గీత సంఘం జిల్లా నాయకులు అన్యపు వెంకట్ పుల్కారం మల్లేష్ బిసు మధు బీసు రాములు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *