సాక్షి డిజిటల్ న్యూస్ 6 నవంబర్ 2025 దేవరాపల్లి రిపోర్టర్ రాజు, కోటి సంతకాల సేకరణతో కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తామని మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు అన్నారు మండలంలోని నాగయ్యపేట గ్రామంలో కాశీపురం ఎంపీటీసీ వంటకు పైడితల్లమ్మ ఆధ్వర్యంలో స్థానిక రచ్చబండ వద్ద కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది రాష్ట్ర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల సలహా సంఘం సభ్యులు బూడి మాట్లాడుతూ కూటమి అర్ధరహిత చర్యలను ఆయన తప్పుపట్టాడు 17 వైద్య కళాశాలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా నిరంతరం పోరాటం చేస్తామని ఉద్ఘాటించారు అనంతరం గ్రామస్తులతో సంతకాలు సేకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షురాలు చింతల బుల్లి లక్ష్మీ జెడ్పిటిసి కర్రీ సత్యం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బూరె బాబురావు పార్టీ సీనియర్ నాయకులు వంటాకు శ్రీను జామి గోవిందా జామి మంగబాబు కొట్యాడకృష్ణమ్మ తమటపు శంభు నాయుడు వాకాడ సతీష్ జామి పోలి నాయుడు మండల ఎరుకు నాయుడు దాసరి కృష్ణ అల్లు సన్యాసిరావు జాగరపు లక్ష్మయ్య నంబారు గంగన్న కొట్యాడ అప్పలనాయుడు బూడి అప్పారావు పాల్గొన్నారు