కార్తీక పౌర్ణమి దీప కాంతులతో ప్రజ్వరిల్లుతున్న శైవ క్షేత్రాలు

*భక్తులతో కిటకిటలాడిన శ్రీ భవనేశ్వరి పాలిత శ్రీ అమ్మ లలితా లోకేశ్వరి శివ శంకర శివాలయం - కీసర


సాక్షి డిజిటల్ న్యూస్, రిపోర్టర్ :బొక్కానాగేశ్వరరావు, (నవంబర్ 6 2025 ) కార్తీకమాసం కార్తీక పౌర్ణమి సందర్భంగా కంచికచర్ల పట్టణ, మండల పరిధిలోని గ్రామాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి తులసి, ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించడం జరిగింది. కంచికచర్ల,శ్రీ అన్నపూర్ణ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం పాత శివాలయంలో, బైపాస్ రోడ్డు పక్కన ఉన్న శ్రీ శివసాయి క్షేత్రం లో తెల్లవారుజామున నుండే భక్తులు పెద్ద సంఖ్యలో దేవాలయంలో దీపారాధన చేసి స్వామి వారిని దర్శించుకొన్నరు. ప్రత్యేక పూజలు అభిషేకాలు గోత్రనామాలతో పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. మండల పరిధిలో గొట్టుముక్కల పరిటాల కొత్తపేట ఘనిఆత్కూరు చెవిటికల్లు కునికినపాడు మున్నలూరు కీసర గ్రామంలలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి సాయంత్రం 5 గంటల నుండే భక్తులు పెద్ద సంఖ్యలో శివాలయాల్లో 365 వత్తులు వేలిగించి, ఆకాశ దీపం చూసి జోలా తోరణం లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. స్వామి వారి ఆశీస్సులతో స్వామి వారి కృపాకటాక్షలకు పాత్రలు కాగలరని ఆలయ ప్రధాన అర్చకులు , కాకాని హనుమంత్ సుమన్ శర్మ, పవన్, తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవాలయ కమిటీ పర్యవేక్షించారు భక్తులకు ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా కార్తీక పౌర్ణమి గురించి తెలుపుతూ కార్తీక మాసం ప్రతిరోజు పర్వదినమే అని అయితే ఈ మాసం నెల రోజులు చేసే పూజలు అన్నింటి కంటే కార్తీక పౌర్ణమి రోజు చేసే పూజలు ఫలితం అధికంగా ఉంటాయని అగ్నితత్వం మాసమైన కార్యక్రమంలో వచ్చే పౌర్ణమికి చంద్రుని విశేషంగా ఆరాధించాలని తెలుపుతారు. ఈరోజు శివాలయంలో ఈశ్వరునికి నవరసాలతో పంచామృతం మహాన్యాసం పూర్వక రుద్రాభిషేకం ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తారు అనంతరం సంధ్యా సమయంలో శివాలయములో జోలతోరణం నిర్వహిస్తారు ఎండు గడ్డితో తాడును తయారుచేసి ఆలయం ముంగిట దూరంగా అమర్చి దానిని ఆవు నెయ్యి దీపంతో వెలిగిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *