నీలాద్రి ఆలయానికి గుడిగంట అందించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ బాలాజీ

*అభినందించిన నీలాద్రి ఆలయ చైర్మన్ నరసింహారావు, డైరెక్టర్ దగ్గుల నాగిరెడ్డి

తల్లాడ/నవంబర్ 05(సాక్షి డిజిటల్ న్యూస్ ) సత్తుపల్లి నియోజకవర్గంలోని పెనుబల్లి మండలంలో ఉన్న నీలాద్రిశ్వర స్వామి ఆలయానికి ఖమ్మం ట్రాఫిక్ కానిస్టేబుల్, సుదీర్ఘకాలం తల్లాడలో విధులు నిర్వహించిన బానోతు బాలాజీ గుడిగంట బహూకరించారు. ఈ మేరకు బుధవారం ఆలయ నిర్వాహకులకు గంటను అందించారు. సుమారు నాలుగు న్నర కేజీలు బరువు గల గంటను ఆయన అందించారు. ఆలయ కమిటీ ఈవో, ఆలయ చైర్మన్ నరసింహారావు సమక్షంలో ఆయన గుడిగంటను గుడికి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాలాజీని ఆలయ చైర్మన్ నరసింహారావు, తల్లాడ మండల నీలాద్రి ఆలయ డైరెక్టర్ దగ్గుల నాగిరెడ్డి అభినందించారు. ఆలయానికి సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా మానవ జన్మకు సార్థకత ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా బాలాజీ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని గంటను బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డైరెక్టర్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *