శానిటేషన్ వర్కర్ల సమస్యలపై ఎమ్మెల్యే బుడ్డాను కలిసిన సిఐటియు నాయకుడు చిన్న మరెన్న

*కార్మికుల సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి

సాక్షి డిజిటల్ న్యూస్:నవంబర్ 6,నంద్యాల జిల్లా,శ్రీశైలం మండలం రిపోర్టర్ కోటి. శ్రీశైల దేవస్థానంలో హౌస్ కీపింగ్,శానిటేషన్ విభాగములో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికుల సమస్యలపై చాలా రోజుల నుండి గతంలో ఉన్న ఏజెన్సీ యాజమాన్యాలతో మాట్లాడడం జరిగిన న్యాయం జరగడం లేదని బుధవారం శ్రీశైలం వచ్చిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని గొట్టేపాటి అతిధి గృహంలో కలిసి శానిటేషన్ కార్మికుల సమస్యలపై కలవడం జరిగినదని సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యులు మునిపాటి చిన్న మారెన్న పేర్కొన్నారు. స్పందించిన ఎమ్మెల్యే బుడ్డా శానిటేషన్ కార్మికులకు గతంలో ఉన్న ఉచిత బస్సును ప్రస్తుతం ఉన్న ఏజెన్సీ యాజమాన్యంతో మాట్లాడి తప్పకుండాఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారని అన్నారు.కొత్తగా వచ్చిన పద్మావతి ఏజెన్సీ యాజమాన్యం వారు ఈ మధ్యకాలంలో కొత్తగా కార్మికులను చేర్చుకుంటున్నారని, అయితే వీరికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కార్మికులు ఈపీఎఫ్,పీఎఫ్ సౌకర్యం,ఉద్యోగ భద్రత కల్పించాలని తెలిపారు.ఈ విషయంపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ ఎమ్మెల్యే పద్మావతి ఏజెన్సీ వారితో మాట్లాడి తొలగించిన బస్సును మళ్ళీ ఏర్పాటు చేయిస్తాను అలాగే ఈఎస్ఐ గుర్తింపు కార్డులను మంజూరు చేయించి జీతాలు పెంచే విధంగా మాట్లాడతానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో హౌస్ కీపింగ్ వర్కర్స్ మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *