సాక్షీ డిజిటల్ న్యూస్, కాకినాడ జిల్లా, శంఖవరం మండలం, అన్నవరం, నవంబర్ 6 రిపోర్టర్ యస్. నాగార్జున.ప్రముఖ పుణ్య క్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్య స్వామి వారికి కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు జరిగే గిరి ప్రదక్షిణo ఆశేష భక్తులు నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ గిరి ప్రదక్షిణ ఉదయం 8 గంటలకు మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించారు. ఉదయం 8 స్వామి వారిని పల్లకి మీద ఊరేగించి మధ్యాహ్నం 2 గంటలకు సత్య రథం మీద గిరి ప్రదక్షిణ జరిగింది. ఈ గిరి ప్రదక్షిణలో భక్తులుకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు మంచి నీటి వితరణ,అన్న ప్రసాద వితరణ. మజ్జిగ స్టాలను ఏర్పాటు చేశారు. అనేక మంది దాతలు కూడా ఈ గిరి ప్రదక్షిణలో భక్తులుకు పండ్లు, వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ అందించారు. పోలీసు వారు కూడా భక్తులకు ఎటు వంటి ఇబ్బందులు కలగకుండా బంధోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, ఆలయ ఈ. ఓ ఈర్ల సుబ్బారావు, చైర్మన్ ఐ. వి రోహిత్ కుమార్, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
