రైతులకు ఎలాంటి నిబంధనలు కొర్రీలు లేకుండా పత్తి కొనుగోలు చేయాలి

* బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పోషబోయిన మల్లేశం

సాక్షి డిజిటల్ న్యూస్,నవంబర్ 06,రామన్నపేట మండలం రిపోర్టర్,శ్యామల నాగరాజు వంశరాజ్: రామన్నపేట మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పోషబోయిన మల్లేశం మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పత్తి పంట సాగు చేస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి రైతులను చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి పకృతి వాతావరణం సహకరించక నెల రోజుల నుండి ఎడతెరిపిలేని వర్షాలకు రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పటికే పత్తి సాగుకు పెట్టుబడి పెరిగి కూలీలు దొరకక నిండా మునిగిన రైతులకు తాజాగా ప్రభుత్వాలు తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో స్లాట్ విధానంలో పత్తి అమ్మకానికి ముందే స్లాట్ బుక్ చేసుకోవడం ఓటీపీ సమస్యలు ఒక ఎకరంకు 7 ఏడు క్వింటాళ్ల పత్తి దిగుబడిని మాత్రమే కొనుగోలు చేస్తామని తేమశాతం 8 నుండి 12 శాతం వరకు ఉంటే మాత్రమే దిగుబడి చేసుకుంటామని పత్తి కేంద్రం వద్ద అధికారులు చెప్పుతుండడంతో తేమ శాతం ఎక్కువ రావడం వల్ల పత్తి కొనుగోలు చేయడం లేదు ఏమి చేయాలో అర్థం కాక రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో దళారుల వద్ద తక్కువ ధరలకు క్వింటాకు 5000 నుండి6000 అమ్ముకొని రైతులు తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది.రైతులుగత సంవత్సరం మాదిరిగానే రైతులకు ఎకరంకు 12 క్వింటాళ్ల పత్తిని సిసిఐ కొనుగోలు చేయాలని తేమ శాతం ఎక్కువగా ఉన్న కొనుగోలు చేయాలని పత్తి అమ్మకానికి స్లాట్ విధానాన్ని రద్దు చేసి రైతు ఇష్టమున్న కాటన్ మిల్లు వద్ద పత్తి అమ్ముకోవడానికి అవకాశం కల్పియాలని ఈ సంవత్సరం తీసుకొచ్చిన కొత్త నిబంధనలను వెంటనే ఎత్తివేయాలని ప్రభుత్వాలను కోరడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *