నవంబర్ 9న జిఎంపిఎస్ 3వ జిల్లా మహాసభ జయప్రదం చేయండి.

*గొల్లకురుమ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం.

సాక్షి డిజిటల్ న్యూస్ /నవంబర్ 06, చెన్నారావుపేట, వరంగల్ జిల్లా నవంబర్ 9న నర్సంపేట పట్టనం లో పద్మశాలి ఫంక్షన్ హాల్లో జరుగు గొర్రెలు,మేకల పెంపకందార్ల సంఘం వరంగల్ జిల్లా మూడో మహాసభ జయప్రదం చేయండి అని తెలంగాణ గొర్రెలు మేకల పెంపకందార్ల సంఘం{GMPS} వరంగల్ జిల్లా కార్యదర్శి పరికి మధుకర్ గొల్లకురుమలకు పిలుపునిచ్చారు. చెన్నారావుపేట మండలం జల్లి గ్రామంలో జిఎంపిఎస్ వరంగల్ జిల్లా మూడవ మహాసభల కరపత్రాలను ఆవిష్కరణ చేశారు, అనంతరం నిర్వహించిన సమావేశంలో గొర్రెలు,మేకల పెంపకందార్ల సంఘం పరికి మధుకర్ మాట్లాడుతూ గొల్లకురుమల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని,గొల్లకురు మల సమస్యల పరిష్కరణకై ఐక్యంగా పోరాటాలు నిర్వహించాలని , ఎన్నికల్లో గొల్లకురుమలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, వృత్తి రీత్యా గొల్లకురుమలు మూగజీవాల మేపుటకు వెళ్ళినప్పుడు విష పురుగుల వల్ల, వివిధ రూపాల్లో చనిపోతున్నారని, చనిపోయిన గొర్రెల కాపరుల కుటుంబానికి పదిలక్షల రూపాయలు ఎక్స్ క్రషియా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు, ఖాళీగా ఉన్న వెటర్నరీ పోస్టులను భర్తీ చేసి, మూగజీవాలకు ఎల్లవేళలా వైద్యం అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు, గొర్రెల పెంపకం దారుల సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలని, ప్రతి గ్రామంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు, తదితర సమస్యల పరిష్కారానికి వరంగల్ జిల్లా మూడవ మహాసభలో చర్చించి భవిష్యత్తు పోరాటాలకు సిద్ధమవుతామని వివరించారు, మహాసభ జయప్రదంకై గొల్లకురుమలు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు బోయిన నాగరాజు, జక్క రవి, కాసాని ఎర్రన్న, మల్లయ్య, కాసాని సుధాకర్, జక్క వెంకన్న, వడగండ్ల చిన్నరాజు, తోగరు కుమార్, రాజు కట్టయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *