సాక్షి డిజిటల్ ప్రతినిధి కొండ అవినాష్ 05- నవంబర్ 2025 మధిర ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని ప్రారంభించిన రిటైర్డ్ ఎంఈఓ అనుమోలు భాస్కరరావు. ప్రెస్ క్లబ్ రిజిస్ట్రేషన్ ను ఆవిష్కరించిన రిటైర్డ్ ఎంపీడీవో మాధవరపు నాగేశ్వరరావు. మధిర నియోజకవర్గ కేంద్రంలో మెయిన్ రోడ్డు లక్ష్మి మెడికల్ ఎదురుగా మధిర ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని మధిర రిటైర్డ్ ఎంఈఓ అనుమోలు భాస్కరరావు ప్రారంభించారు. బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు జివి, సెక్రటరీ అరుణ్ గౌరవ అధ్యక్షులు నాళ్ల శ్రీనివాసరావు గౌరవ సలహాదారులు తమ్మారపు బ్రహ్మం ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ కార్యాలయం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా మధిర ప్రెస్ క్లబ్ రిజిస్ట్రేషన్ ను రిటైర్డ్ ఎంపీడీవో మాధవరపు నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సామాజిక సేవకులు లంక కొండయ్య, ఆర్కే ఫౌండేషన్ రామకృష్ణ ప్రెస్ క్లబ్ కోశాధికారి కాకరపర్తి శ్రీనివాసరావు ఉప కోశాధికారి శ్రీధర్ ఉపాధ్యక్షు లు వంగూరు గోపి, లిక్కి రవీందర్ ప్రచార కార్యదర్శి అర్జున్ సహాయ కార్యదర్శులు వాసు సుధీర్ మహంకాళి వెంకట శ్రీనివాసరావు చారుగొండ్ల నరసింహమూర్తి బాణాల శంకరాచారి గౌతమ్ మరియు కార్యవర్గ సభ్యులు కొండ అవినాష్ ఎరగని నాగరాజు ముఖేష్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.