కార్తీక శుద్ధ పౌర్ణమి సందర్భంగా వివిధ ఆలయాల్లో భక్తుల సందడి

సాక్షి డిజిటల్ న్యూస్ 6 నవంబర్ 25 జమ్మికుంట టౌన్ రిపోర్టర్ తంగళ్ళపల్లి శ్యామ్ కిషోర్, జమ్మికుంట పట్టణంలోని స్థానిక శివాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో ఆలయ ప్రాంగణం అంతా కిటకిటలాడింది.కార్తీక పూర్ణిమ శుభ సందర్భంగా, భక్తులు తమ పాపాలను తొలగించుకుని మోక్షాన్ని పొందడానికి పవిత్ర గంగా నదిలో స్నానం చేస్తారు . ఈ సంవత్సరం, స్నానం చేయడానికి శుభ సమయంకార్తీక శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పున్నమి అనగా కార్తీక మాసములో శుక్ల పక్షములో పున్నమి తిథి కలిగిన 15వ రోజు. కార్తీకమాసములో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ కార్తీక పౌర్ణమి అనేది హరి, హారులకు అత్యంత ప్రీతికరమైన మాసం. అన్ని మాసాల్లోను కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత కలిగినది అని వేదాలు, పురాణాలు చెబుతున్నాయి. ‘శివునికి, విష్ణువునకు ఇద్దరికీ ఎంతో ఇష్టమైన మాసం కావున, కావున మానవాళికి వారిద్దరిని కొలిచి తరిస్తే వారి శుభ అనుగ్రహం పొందడానికి తగిన మాసమని దీనికి ఎంతో ‘ప్రాశస్త్యం’ కలిగినది అని పురాణాలుతెలుపుతున్నాయి. ఈ మాసంలో ప్రతి దినమూ పవిత్రమైనదే. సోమవారాలు, రెండు ఏకాదశులు, శుద్ధ ద్వాదశి, పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి అధిక ప్రభావవంతమైనవి. నెలరోజులూ చేసే కృత్యాల ఫలితం ఒక ఎత్తు, పౌర్ణమి నాటి కృత్యాల ఫలితం మరొక ఎత్తు. అందువల్ల అనేక వ్రతాలు, పూజలు, కృత్యాలకు, దైవారాధనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలనీ పురాణాలు వివరిస్తున్నాయి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *