సాక్షి డిజిటల్ న్యూస్: నవంబర్ 4, రిపోర్టర్: జుక్కల్ నియోజకవర్గం ఇంచార్జ్ : దత్తు కామారెడ్డి జిల్లా.జుక్కల్ మండలం.బస్వాపూర్ గ్రామంలో బోరుబావిలో ఉన్న మోటార్ ప్రాబ్లం రావడం వల్లన ఎటువంటి నీటి కొరత సమస్య రాకూడదని తన సొంత డబ్బుతో మోటర్ ను అమర్చడం జరిగింది పంచాయతీ కార్యదర్శి భరద్వాల్ కన్నా . మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ వాగ్మరి సురేష్, ఆధ్వర్యంలో నూతన( సిఆర్ఐ ) పంపు మోటర్ ను ఈరోజు అమర్చడం జరిగింది. గ్రామంలో ఏలాంటి సమస్యలను ఉన్న తమ వంతు అయినప్పటికీ త్వరలో తన దృష్టికి వచ్చిన సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు .ఇందులో కారోబార్ గంగారం మరియు వీరేశం తదితరులు పాల్గొన్నారు.