సాక్షిడిజిటల్ న్యూస్, నవంబర్05,రాయికల్,వై. కిరణ్ బాబు:- జగిత్యాల జిల్లా రాయికల్ బాలుర ఉన్నత పాఠశాలలో తెలంగాణ గెజిటెడ్ ఉపాధ్యాయ సంఘం, టీ షాట్ ఆధ్వర్యంలో రాయికల్ మండలంలోని విద్యార్థులకు మంగళవారం ప్రతిభ పాటవ పోటీలను నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు భోగ రమేష్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న అంతర్గత శక్తులను బయటకు తీయడానికి విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని పెంచడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రధానో పాధ్యాయులు భోగ రమేష్ అన్నారు. అలాగే బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాపు శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులను అభినందించారు. జిల్లా స్థాయిలో కూడా మంచి ప్రతిభను కనబరచాలని ఆయన అన్నారు. విద్యార్థులకు వ్యాస రచన, ఉపన్యాస, క్విజ్ పోటీలు పెట్టారు. ఉపన్యాస పోటీలలో ప్రథమ బహుమతి అనుశ్రీ(కస్తూరి భా గాంధీ పాఠశాల)రెండవ బహుమతి డి. అలేఖ్య (రాయికల్ బాలికల ఉన్నత పాఠశాల)తృతీయ బహుమతి నిత్య శ్రీ (కేజీబీవీ రాయికల్ )సాధించారు.క్విజ్ పోటీలో ప్రథమ బహుమతి రామాజీపేట్ ఉన్నత పాఠశాల, ద్వితీయ బహుమతి రాయికల్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు గెలుపొందారు. ఉపన్యాసల పోటీలో ప్రథమ బహుమతి డి. చంద్రిక (అల్లీపూర్ హైస్కూల్), ఎ. దీక్ష మాహి (కేజీబీవి రాయికల్ ), తృతీయ బహుమతి కె. శ్రీరామ్ (బాలికల ఉన్నత పాఠశాల )విద్యార్థులు బహుమతులు సాధించారు. ఈ కార్యక్రమం లో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, కార్యక్రమ ఇంచార్జి, ప్రధానోపాధ్యాయులు భోగ రమేష్,చిప్ప మల్లేశం, పొన్నం రమేష్, జీవన్ రెడ్డి, రాపర్తి నర్సయ్య, చిలివేరి విజయ్, శ్రీనివాస్ రెడ్డి, పద్మ లు పాల్గొన్నారు.