విద్యా వ్యాపారానికి వ్యతిరేకంగా పోరాడుదాం ఆర్ గౌతమ్ కుమార్ జిల్లా అధ్యక్షులు

ధర్పల్లి మండల కేంద్రంలో పిడిఎస్యు మహాసభ సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 4 ధర్పల్లి మండల్ రిపోర్టర్ సురేందర్ పిడిఎస్యు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు ఆర్మూర్ డివిజన్ మహాసభను ధర్పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహాసభకు ముఖ్య వక్తగా హాజరైన పిడిఎస్యు నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఆర్ గౌతమ్ కుమార్ మాట్లాడుతూ ..రాష్ట్రంలో విద్యారంగా ప్రైవేటు కార్పొరేట్ శక్తుల చేతులలో వెళ్తుందని లక్షల రూపాయల ఫీజులు దోపిడీ జరుగుతుందని విద్యా వ్యాపారమయం అయిందని విద్యా వ్యాపారానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 15% నిధులు విద్యారంగానికి కేటాయిస్తామని హామీ ఇచ్చింది ఏడు శాతం నిధులు కేటాయించడం అంటే విద్య రంగం పట్ల ఎంత ఎలక్షన్ ఎంతో అర్థం చేసుకోవచ్చు వచ్చును స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ గత నాలుగు సంవత్సరాలుగా తొమ్మిది వేల కోట్లు పెండింగ్లో ఉన్నాయని వాటిని విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యను కాపాడాలని మూసివేసిన ప్రభుత్వ బడులను ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు. ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి ఎన్ దాసు మాట్లాడుతూ..ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ కష్టపడి చదివే విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా ప్రభుత్వ ఉద్యోగం ఎలాగా మారిపోయే పరిస్థితి ఉందని ప్రభుత్వ సంస్థలను నెలకొల్పి విద్యార్థులకు భవిష్యత్ భరోసా కల్పించాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.పి డి ఎస్ యు జిల్లా కార్యదర్శి జన్నరపు రాజేశ్వరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం 2020 ను తెచ్చి విద్యా కాషాయీకరణ చేస్తుందని విద్యార్థుల మెదడులోనూ పక్క ద్రోహ పట్టించే కుట్ర జరుగుతుందని పాఠ్య పుస్తకాల చరిత్రను వక్రీకరిస్తుందని అందుకే ఎన్ని nep2020 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో 150 విద్యార్థులు పాల్గొన్నారు మరియు పి డి ఎస్ యు మాజీ నాయకులు ప్రస్తుత ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకులు వి బాలయ్య, పిడిఎస్ఈ ఆర్మూర్ డివిజన్ అధ్యక్షులు ప్రిన్స్, డివిజన్ నాయకులు హుస్సేన్, రాహుల్, హనుమంత్ రెడ్డి, గణేష్ సాయి రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *