భీమారం మండలం వెంకట్రావు పేట గ్రామంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

సాక్షి డిజిటల్ న్యూస్ 5నవంబర్ 2025 (జగిత్యాల జిల్లా ఇంచార్జ్) బోనగిరి మల్లారెడ్డి సొసైటీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం ఈ సందర్భంగా భీమారం సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ ప్రారంభించి వారు మాట్లాడుతూ. తుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రతి మండలంలో ప్రతి గ్రామాన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. రైతులు తగిన తేమ శాతం ఉన్న, శుభ్రమైన ధాన్యాన్ని మాత్రమే కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. దళారులను ఆశ్రయించకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయాలు జరపాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుంది. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి గింజ, ప్రతి వరి ధాన్యం మద్దతు ధరకు కొనుగోలు చేయబడుతుందని, రైతులు దళారుల మాయలో పడకుండా నేరుగా కేంద్రాల్లోనే విక్రయం చేయాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ కానుగంటి శ్రీనివాస్. అంబేద్కర్ సంఘం జిల్లా కన్వీనర్ బంగారు దీపక్. కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కొత్తపెళ్లి అజయ్. సొసైటీ సీఈవో. కవిత. గ్రామ రైతులు కట్ట శేఖర్. కాటేపల్లి మల్లారెడ్డి. అల్లం గంగరాజం. గడ్డం కిష్టారెడ్డి. కటిపల్లి వేణు. పిడుగు ఎర్రన్న. కొంక గంగాధర్. ముదిగొండ మధు. సింగపూర్ మల్లయ్య. వినోద్. మరియు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *