జూబ్లీ మాదే కాంగ్రెస్ విజయాన్ని ఎవరు ఆపలేరు•

*ప్రజలు మెచ్చే పాలన చేస్తున్నాం * ప్రచారంలో పాల్గొన్న సింగరేణి మండల కాంగ్రెస్ నాయకులు

    సాక్షి డిజిటల్ న్యూస్ కారేపల్లి, నవంబర్ 5, హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం కారేపల్లి మండల కేంద్రానికి చెందిన జిల్లా కాంగ్రెస్ నాయకులు తలారి చంద్రప్రకాష్, మంగళవారం జూబ్లీహిల్స్ లోని 99వ డివిజన్ వెంగళరావు నగర్ లోని విధులలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాలలో ముందుకు పోతుందని అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ పరిపాలన సాగుతుందని అన్నారు. గత పాలనలో ప్రజలు విసుగు చెందారని అందుకే టిఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తూ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు విడతల వారీగా అమలు చేయడం జరిగిందని కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. నవీన్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కారేపల్లి మండల కాంగ్రెస్ నాయకులు సొసైటీ డైరెక్టర్ బానోత్ హీరలాల్, ఎస్సీ సెల్ అధ్యక్షులు మేదిరి టోనీ,అజ్మీరా ఈర్య నాయక్ తదితరులు పాల్గొనడం జరిగింది.

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *