కోరుట్ల బాబు జగ్జీవన్ రామ్ పార్క్ లో అభివృద్ధి శూన్యం వెంటనే నిధులు కేటాయించాలని మహమ్మద్ ముజాహిద్ డిమాండ్

సాక్షి డిజిటల్ నవోంబర్ 04 ధర్మపురి నియోజకవర్గ రిపోర్టార్ అజయ్ : కోరుట్ల మున్సిపాలిటీకి తాజాగా వచ్చిన 18 కోట్ల రూపాయల నిధుల్లో నుండి బాబు జగ్జీవన్ రామ్ పార్క్ అభివృద్ధికి తక్షణమే నిధులు కేటాయించాలని సమాజ్ వాది పార్టీ స్టేట్ సెక్రటరీ మరియు యునైటెడ్ ముస్లిం మైనారిటీ రైట్స్ ఆర్గనైజేషన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ ముజాహిద్ డిమాండ్ చేశారు. కోరుట్ల పట్టణంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడాతూ పట్టణ ప్రజలు కుటుంబాలతో కలిసి విశ్రాంతి తీసుకునే ప్రదేశంగా ఉన్న బాబు జగ్జీవన్ రామ్ పార్క్‌లో ఎలాంటి సౌకర్యాలు లేవని పార్క్‌లో లైటింగ్, బెంచీలు, ట్రాక్, పిల్లల ఆటవస్తువులు వంటి ప్రాధమిక వసతులు లేక దాదాపు లక్ష మంది జనాభా కలిగిన కోరుట్ల లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజలు చెల్లించే పన్నులు ప్రజల అభివృద్ధికే వినియోగించాలి. మున్సిపాలిటీకి వచ్చిన 18 కోట్లు ఎక్కడ వినియోగిస్తోందన్నది పారదర్శకంగా ప్రజలకు తెలుపాలి. అందులో భాగంగా ఈ పార్క్ అభివృద్ధికి వెంటనే నిధులు కేటాయించాలని మేము బలంగా డిమాండ్ చేస్తున్నామని ముజాహిద్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్, టిడబ్ల్యుజెఎ రాష్ట్ర అధ్యక్షులు టైగర్ అలీ నవాబ్, శనిగారపు రాజేష్. మాదిగ సంఘం పట్టణ అధ్యక్షులు శనిగారపు రాజేష్ లు మాట్లాడుతూ కోరుట్ల పట్టణ అభివృద్ధిలో పార్క్‌లు కీలక పాత్ర వహిస్తాయని. వాటిని నిర్లక్ష్యం చేయడం ప్రజల ఆరోగ్య సామాజిక హక్కులకు విరుద్ధమని తెలిపారు. ప్రభుత్వం మరియు మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *