సాక్షి డిజిటల్ న్యూస్ : 3 నవంబర్ 2025 తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్చార్జి రమేష్ బాబు ( రాము) అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం కరువు మండలాలుగా ప్రకటించాలని సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ ములకలచెరువు మండలం ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో కార్యదర్శి అంజన్నప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అంజనప్ప మాట్లాడుతూ తంబళ్లపల్లి నియోజకవర్గంలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రైతుల పెట్టిన పంట నూరుపిడిలో ఎంత దిగుబడి వచ్చింది నివేదికలు తయారుచేసి ప్రభుత్వానికి నివేదికల ద్వారా పంపి తంబళ్లపల్లె నియోజకవర్గాన్ని ఆరు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి కురబలకోట మండలం కరువు మండలం ప్రకటిస్తూ మిగతా ఐదు మండలాలు కరువు మండలాలుగా ప్రకటించకుండా పోవడం బాధాకరమైన విషయం సత్య సాయి జిల్లా సరిహద్దులో ఉన్న తంబళ్లపల్లి నియోజకవర్గం రైతాంగం వ్యవసాయంపై ఆధారపడి జీవనము కొనసాగించే రైతాంగం పెట్టిన పంటలు చేతికి రాక చేతికి వచ్చిన పంట గిట్టుబాటు ధరలు లేక సాగు చేసిన రైతాంగం నష్టపోయారు ప్రభుత్వం వారు అన్నమయ్య జిల్లాలో కొన్ని మండలాలు కరువు మండలాలుగా ప్రకటించి తమ్మాలపల్లి నియోజకవర్గం లో పెద్దమండెం, తంబళ్లపల్లె ,ములకలచెరువు, పిటిఎం, కొత్తకోట కరువు మండలాలుగా ప్రకటించకపోవడం చాలా బాధాకరం అదేవిధంగా ముంతా తుఫాన్ వల్ల రోడ్లు చెరువులు తెగిపోయి రోడ్లు పాడయ్యాయి కూటమి ప్రభుత్వం సర్కార్ అభివృద్ధిలో ఎక్కడ ఏసిన గొంగళి అక్కడే అన్నట్టు కేటాయించలేదు ములకలచెరువు మండలం వారపు సంతలు రోడ్లపైన కొనసాగిస్తున్నారు మొలకలచెరువులు వారపు సంత పేటియం రోడ్డు నందు నిర్వహిస్తూ రవాణా సౌకర్యానికి అంతరాయం కలిగిస్తూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఆర్టీసీ బస్టాండ్ నందు చదువుకునే విద్యార్థులకు మహిళలకు బాత్రూములు గాని లిటిల్ రూములు గాని తాగినీటి సౌకర్యం గాని కల్పించలేదు ఆర్టిసి డిపార్ట్మెంటు ప్యాసింజర్లకు తగిన సౌకర్యాలు కల్పించకుండా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు ములకలచెరువు ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నది ములకలచెరువు టమోటా మార్కెట్ యార్డుకు రైతాంగం మూడు జిల్లాల నుండి ములకలచెరువు మార్కెట్ యార్డ్ కు వచ్చేవారు మార్కెట్ యార్డ్ స్థలం విస్తీర్ణం తక్కువ అయినందున రైతాంగం వాహనదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రభుత్వం వారు ములకలచెరువు మార్కెట్ యార్డుకు 50 ఎకరాలు విస్తీర్ణాన్ని ప్రభుత్వం స్వీకరించి మార్కెట్ యార్డ్ డెవలప్మెంట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ములకలచెరువు నుండి తంబళ్లపల్లి ఆర్ఎంబి రోడ్ ములకలచెరువు నుండి బి కొత్తకోట డబల్ రోడ్డు వర్షాలకు చాలా దెబ్బ తిన్నాయి రోడ్డు మరమ్మతులు చేపట్టి వాహనదారులకు సౌకర్యార్థం కల్పించాలని ప్రజల ప్రాణాలు కాపాడాలని భారత కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేస్తున్నాం నీటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెరువు కట్టల మరమ్మతుల్లో మూసుకోలేదు ముంతా తుఫాన్ వర్షాలకు చెరువు కట్టలు తెగి వచ్చిన నీరు వృధా అయిపోయింది తెగిపోయిన చెరువులు సోంపల్లి గ్రామం నందు చిన్నమ్మ చెరువు కానగలకుంట మేకల పాపన్న కుంట నాయన చెరువు జోకులు చెరువు కొత్తచెరువు కొత్త కుంట తెగిపోయినవి ఈ చెరువులో కట్టలు మరమ్మతులకు నోచుకోలేదు ప్రభుత్వం అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారు స్పందించి అభివృద్ధి పనుల పైన చర్యలు తీసుకొని రోడ్లు చెరువులు మరమ్మతులు చేపట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలని భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమములో దళిత హక్కుల పోరాట సమితి జిల్లా నాయకుడు మంచాల హరి సిపిఐ మండల సహాయ కార్యదర్శి నిజాంద్దీన్,శంకరమ్మ ,రమణమ్మ, అంజనమ్మ,శంకరప్ప ,ఉత్తన్న, చంద్ర న్న కొంతమంది నాయకులు పాల్గొన్నారు