కిష్టంపేటకు బస్సు పునరుద్దరించాలని వినతి

సాక్షిడిజిటల్ న్యూస్, నవంబర్ 04,రాయికల్,వై. కిరణ్ బాబు:- జగిత్యాల జిల్లా రాయికల్ మండల పరిధిలోని కిష్టంపేట గ్రామానికి ఆర్టీసీ బస్సును పునరిద్దరించాలని గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ సిరిపురం సత్తయ్య, భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా నాయకులు తిరుమల శంకర్, బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షులు చిలక శ్రీనివాస్ సోమవారం రోజున ప్రజా వానిలో కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగిత్యాల డిపో బస్సు జగిత్యాల నుండి కండ్లపెల్లి, కిష్టంపేట మీదుగా అల్లీపూర్, మండల కేంద్రం రాయికల్, దావన్ పెళ్లి వరకు ఆర్టీసీ నడపడం వలన పలు గ్రామాల ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేదని, ఏవో సాకులు చూపి ఆర్ టి సి వారు బస్సులు నిలిపేయడం వలన కిష్టంపేట గ్రామ ప్రజలు మండల కేంద్రం రాయికల్ వెళ్లాలన్న, జిల్లా కేంద్రం జగిత్యాల వెళ్లాలన్న 2.5 కిలోమీటర్లు నడిచి అల్లీపూర్ రోడ్డుకి వెళ్లి ప్రయాణం చేయవలసి వస్తుందని, ప్రజలు, స్త్రీలు, స్కూల్ విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికి ఎన్నిసార్లు ఆర్ టి సి అధికారులకు విన్నవించిన వారు బస్సును నడుపడం లేదని అన్నారు. కావున కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని ఆర్టీసీ బస్సును పునరుద్ధరింప చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ సిరిపురం సత్తయ్య, భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా నాయకులు తిరుమల శంకర్, బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షులు చిలక శ్రీనివాస్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *