సాక్షి డిజిటల్ న్యూస్. నవంబర్ 3 తంబల్లపల్లి మండల రిపోర్టర్ ఇ. రమేష్ బాబు. రాష్ట్ర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు కమిటీ సభ్యుడు గా తంబళ్లపల్లె మాజీ ఎంపీపీ పి.జే. వెంకటరమణారెడ్డి ని వైకాపా అధిష్టానం ఎంపిక చేసినట్లు మండల పార్టీ అధ్యక్షుడు రేపన చౌడేశ్వర తెలిపారు. సోమవారం ఎంపీపీ చిటికి శ్యామల కోటిరెడ్డి సమక్షంలో రైతు రాష్ట్ర కమిటీ సభ్యుడు పీజే వెంకటరమణారెడ్డి, జిల్లా రైతు విభాగ కార్యదర్శి బోడ్రెడ్డిరెడ్డి వారి కోట భాస్కర్ రెడ్డి, బూత్ కమిటీ సభ్యుడిగా డి నరేందర్ రెడ్డి, జిల్లా బీసీ కమిటీ అధ్యక్షుడుగా రామ్మూర్తి లను వైకాపా నాయకులు దుశ్యాలవలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పీజే వెంకట రమణారెడ్డి, సభ్యులు మాట్లాడుతూ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ఇచ్చిన ఈ పార్టీ పదవికి కృతజ్ఞతులను ప్రకటించి మండలంలో వైకాపా అభివృద్ధితో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోటిరెడ్డి, ఆధార్ మల్లికార్జున రాయల్,ప్రత్యేక ఆహ్వానితుడు ఎరుకుల రెడ్డి, మల్లయ్య కొండ మాజీ చైర్మన్ మల్ రెడ్డి, ఎంపీటీసీలు మహేష్, కరీం, సర్పంచ్ లు సంగం అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, వీరభద్ర, అలీ, జయ నారాయణరెడ్డి, చిన్నపరెడ్డి, రెడ్డి మల్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, సిమెంట్ రమణారెడ్డి,ఖాదర్ బాషా, అమర్నాథ్ రెడ్డి, తులసినాయక్, వైకాపా నాయకులు పాల్గొన్నారు.