సాక్షి, డిజిటల్ న్యూస్, నవంబరు 1, శంకరపట్నం (శ్రీరాంపూర్ ,మంచిర్యాల జిల్లా) శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే ఫైవ్ గని కార్యాలయంలో శనివారం అధికారులు పెద్ద ఎత్తున కార్మికులకు కౌన్సిలింగ్ నిర్వహించారు, డ్యూటీ కి రోజుల తరబడి డుమ్మా కొట్టడమే కాకుండా అధిక శాతం గైరాజరు, కావటంతో అధికారులు కార్మికులకు కౌన్సిలింగ్ నిర్వహించి సమస్యలను , బాధలను, పరిస్థితిలను,అడిగి తెలుసుకున్నారు, గని కార్మికులకు సింగరేణి సంస్థ అన్ని రకాలుగా సంపూర్ణ సహకారాలు చేస్తున్న తరుణంలో ఎందుకు డుమ్మ కొడుతున్నారని ,అధికారులు కార్మికులను ప్రశ్నించారు, అధికారుల తో కార్మికులు మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలతో, తల్లడిల్లుతున్నట్లు, మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు, కాళ్లకు సంబంధించిన ఆపరేషన్ల విషయంలో అండర్ గ్రౌండ్ కి వెళ్ళుటకు ఇబ్బందిగా ఉండడంతో డ్యూటీలకు డుమ్మా కొడుతున్నట్లు కార్మికులు అధికారులకు వివరించారు, నెలలు తరబడి ఇలాంటి బాధలతో ఇబ్బందులకు గురికావడం జరుగుతుందని ఇందుకు విధులకు హాజరు కాక పోవడం జరుగుతుందన్నారు, అధికారులు మూడున్నర గంటల పాటు కార్మికులకు కౌన్సిలింగ్ నిర్వహించి, విధి నిర్వహణ, ఉద్యోగ భద్రత, సింగరేణి సంస్థ కార్మికులకు ప్రవేశపెట్టిన పథకాలు అనేక అంశాలపై కార్మికులకు వివరించారు, ఈ సందర్భంగా గుర్తింపు సంఘం ఫిట్ సెక్రటరీ గునిగంటి నర్సింగరావు మాట్లాడుతూ కార్మికులకు ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు వివరించడంతో స్పందించారు, , కార్మికుల సమస్యల విషయంలో యజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు, ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి నాంది పలికే విధంగా ఉంటుందని కార్మికులకు తెలిపారు,, ఈ కార్యక్రమంలో గ్రూప్ ఏజెంట్ ఎన్ శ్రీధర్, గని మేనేజర్ సుధీర్ కుమార్ ఝా, సంక్షేమ అధికారి హరికృష్ణ, గని ఫిట్ సెక్రటరీ గునిగంటి నర్సింగరావు, కార్మికులు హాజరైనారు
