జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ గెలుపే లక్ష్యం గా జోరుగా ఇంటింటి ప్రచారం నిర్వహణవైరా యువ కెరటం– ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్

సాక్షి డిజిటల్ న్యూస్ కారేపల్లి,నవంబర్ 1 జూబ్లీహిల్స్ నియోజకవర్గం ను అన్ని విధాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉప ఎన్నికలలో గెలుపొంది. నవీన్ యాదవ్ నాయకత్వంతో జూబ్లీహిల్స్ అభివృద్ధి జరుగుతుందని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొని వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఇంటింటి ప్రచారం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం వేగం పుంజుకుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం వైరా శాసనసభ్యులు రాందాస్ నాయక్ ని జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 158లో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తలారి చంద్ర ప్రకాష్, సొసైటీ డైరెక్టర్ బానోత్ హీరలాల్, గూగులోత్ భీముడు నాయక్, ఎస్సీ సెల్ అధ్యక్షులు మేదిరి టోనీ, మేదరి రాజా, షఫీ, అజ్మీర రాజు, మరియు స్థానిక కాంగ్రెస్ నాయకులు, యువజన నాయకులు, అలాగే వైరా నియోజకవర్గ నాయకులు కూడా పాల్గొన్నారు. ప్రతి ఇంటిని సందర్శించి ముఖాముఖి మాట్లాడి జూబ్లీహిల్స్ అభివృద్ధి కొనసాగాలంటే ప్రజలతో మమేకమై పనిచేసే యువ నాయకుడు నవీన్ యాదవ్ గారు గెలవాలి. ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుంది అని పేర్కొన్నారు. మహిళా కాంగ్రెస్ నాయకులు ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రజలు ఉత్సాహంగా స్పందించి నవీన్ యాదవ్ ను గుప్పిస్తారని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయమే ప్రజలు ఆశయంగా మారిందని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *