కోగిలతోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లే రోడ్డు కనిపించట్లేదా.

*కనిపించినా….కనిపించనట్టు వ్యవహరిస్తున్నారా *కోగిలతోట గ్రామ పంచాయతీ కార్యదర్శి మండిపడ్డ గ్రామ ప్రజలు ఎమ్మార్పీఎస్ నాయకులు

సాక్షి డిజిటల్ న్యూస్ హొళగుంద అక్టోబర్ 31, హొళగుంద మండల పరిధిలోని కోగిలతోట గ్రామంలో స్థానిక బస్టాండు నుండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వరకు ఉన్న రోడ్డంతా గుంతలమయం… వర్షం వస్తే చాలు అంతా బురదమయం.. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ఆ రోడ్డును చూసి పాఠశాలకు వెళ్లలేని పరిస్థితి. ఏర్పడిన కూడా పంచాయతీ కార్యదర్శి గ్రామాన్ని పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా శుక్రవారం వారు మాట్లాడుతూ గుంతలమయం, బురదమయంతో నిండిపోయిన ఆ రోడ్డు పంచాయతీ కార్యదర్శికి, పాలకులకు కనిపించట్లేదా. ప్రశ్నించారు పాఠశాలకు వెళ్లే దారికి సీసీ రోడ్డు వేయకపోలేదు సరే…. కనీసం మరమ్మత్తులు కూడా చేయించలేరా..?? వర్షాలు కురిసిన బురద మయంతో, గుంతల మయమైన దారిలో పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు నానా అవస్థలు పడుతూ, పాఠశాలకు వెళ్లే పరిస్థితి.. ఇలాంటి రోడ్ల పైన అధికారులు గానీ పాలకులు గానీ ఎందుకు దృష్టిసారించడం లేదనీ ఇలాంటి దారి మీదుగా పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ప్రాణాల మీదకు తెచ్చుకోవాల్సిందేనా..?? ఇలాంటి రోడ్డుకు పాలకులు లేదా అధికారులు మరమ్మత్తులు చేపట్టి… మోక్షం కలిగించేది ఎన్నడు అని ఆవేదన వ్యక్తం చేశారు పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ దారిని వెంటనే మరమ్మతులు చేయించి విద్యార్థుల విద్యాభ్యాసానికి కృషి చేయాలని కోగిలతోట గ్రామ ఎమ్మార్పీఎస్ నాయకులు కే గోవర్ధన్,
ఇటీగాల్ వీరేష్, గ్రామస్తులు డిమాండ్ చేశారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *