సాక్షి, డిజిటల్ న్యూస్, అక్టోబర్ 31, శంకరపట్నం, కరీంనగర్ జిల్లా, సీనియర్ జర్నలిస్టు, బీ,రాజు
తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న వరి చేనులను గురువారం వ్యవసాయ శాఖకు సంబంధించిన కిందిస్థాయి అధికారులు గ్రామాలు పర్యటించి పరిశీలించారు,,చేతికి వచ్చిన వరి చేనులో భారీ వర్షాలతో నీట మునిగి నేలవాలి తీవ్ర నష్టం జరిగినట్లు ఆముదాలపల్లి, రాజాపూర్, ఇప్పలపల్లి కాచాపూర్, వంకాయ గూడెం తాడికల్, తదితర గ్రామాలకు చెందిన రైతులు వ్యవసాయ శాఖ అధికారులకు తెలిపారు, తుఫాన్ ప్రభావంతో భారీ వర్షం పడి పంటలు నష్టపోవడమే కాకుండా ఆర్థికంగా కూడా నష్టపోయినట్లు రైతులు అధికారులకు చెప్పారు, నీట మునిగి, వరి చేను కింద వాలి నష్టపోవడం జరిగిందనీ రైతులు అధికారులకు చెప్పారు, క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టపరిహారం వచ్చే విధంగా ప్రభుత్వానికి నివేదిక అందించాలని రైతులు అధికారులను కోరారు, వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేసి పంటలు సాగు చేస్తే ప్రకృతి పగ పట్టి నష్టం చేయడం జరిగిందని రైతులు అధికారులకు గోడు చెప్పుకున్నారు, అంతే కాకుండా పంట నష్టం జరిగిన తీరును, నీట మునిగిన వరి చేనులను అధికారులకు రైతులు చూపించి కంటతడి పెట్టారు , అధికారులతో పాటు రైతు సంఘం సీనియర్ నాయకుడు కన్నబోయిన జంపయ్య రైతులు పాల్గొన్నారు