సాక్షి డిజిటల్ న్యూస్ అక్టోబర్ 31 తిరుమలగిరి మండలం తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండలంలో అక్టోబర్ 30 బేస్తవారం రోజున ఐకెపి కేంద్రాల పరిశీలన లొ మాలిపురం, రాజన్నకొక్యానాయక్ తండా,, తొండ, మామిడాల, వెలిశాల, బండ్లపల్లి గ్రామాల లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మండల వ్యవసాయఅధికారి,నాగేశ్వర్ రావు, సి సీ ఐకేపీ,నాగయ్య,తో కలిసి సందర్శించడం జరిగింది, కొనుగోలు కేంద్రం లోని ధాన్యం ను అరబెట్టాలని, టార్పాలిన్ లను అందుబాటులో ఉంచుకోవాలని, రైతుల క్రమసంఖ్య నమోదు చేయాలనీ, కనీస అవసరాలను అందుబాటులో ఉంచుకోవాలి, తేమ శాతం వచ్చిన కుప్పలను ట్యాగ్ చేసిన మిల్లు లకు పంపించాలని తహసీల్దార్ బాశెట్టి హరిప్రసాద్ కోరారు.