కుటుంబ సాధికార సభ్యులను నియమించాలి…….

*.తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి

ఆలూరు, అక్టోబర్ 30,పల్లె సాక్షి న్యూస్: ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో 60 ఓటర్లకు ఇద్దరు కుటుంబ
సాధికార సభ్యులు (కె ఎస్ ఎస్ సభ్యులు) లను నియమించాలని ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో ఎలాంటి పదవులకైనా కె ఎస్ ఎస్ సభ్యుల నమోదు తప్పనిసరి అని అన్నారు. అదే విధంగా గ్రామ కమిటీల నియామకాలకు సంబంధించిన వివరాలు వెంటనే పూర్తి చేసి ఇంచార్జికి అందించాలని అన్నారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకులు బూత్ ఇంచార్జ్,యూనిట్ ఇంచార్జ్,క్లస్టర్ ఇంచార్జ్ వెంటనే పూర్తిచేయడానికి తగిన కార్యాచరణ చేపట్టాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *