మొంథా” ప్రభావంతో తెలంగాణలో వర్షాల బీభత్సం

*ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, "" పర్వతనేని విజ్ఞప్తి

సాక్షి డిజిటల్ : అక్టోబర్ 29, అశ్వరావుపేట ఇన్చార్జి, బుల్లా శివ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బంగాళాఖాతంలో ఏర్పడిన, వాయుగుండమే కారణమైంది. ఈ తుఫాను ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో వాగులు వంకలు ఉప్పొంగి రవాణా అంతరాయం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరంలేని సమయంలో ఇళ్ళ నుండి బయటకు రావద్దని కాంగ్రెస్ పార్టీ నాయకుడు పర్వతనేని వరప్రసాద్ విజ్ఞప్తి చేశారు. రైతులు పొలాలకు వెళ్లే ముందు వర్షాల తీవ్రతను గమనించాలని, విద్యుత్ తీగలు తెగిపడే ప్రమాదం ఉన్నందున పిల్లలను ఇంటి బయటకు రానివ్వకూడదని ఆయన తెలిపారు. వరదల కారణంగా ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటే కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ప్రజల ప్రాణ భద్రతే ముఖ్యమని, ఎటువంటి అత్యవసర పరిస్థితుల్లో స్థానిక నాయకులను లేదా అధికారులను వెంటనే సంప్రదించాలని పర్వతనేని వరప్రసాద్ సూచించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండి సురక్షితంగా ఉండాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *