సాక్షి డిజిటల్ న్యూస్:29 అక్టోబర్,పాల్వంచ.రిపోర్టర్:కె.జానకిరామ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని శేషగిరి భవన్ లో జరిగిన పట్టణ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి,కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ,భారత కమ్యునిస్టు పార్టీ(సీపీఐ) వందేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా డిసెంబర్ 26 న ఖమ్మంలో జరిగే శతవసంతాల ముగింపు భారీ బహిరంగ సభకు ప్రతి పల్లె,పట్టణం నుండి ప్రజలు దండుగా తరలిరావాలని తెలిపారు.పార్టీ శ్రేణులు నిరంతరం శ్రమించి,ఈ శతాబ్ది ఉత్సవాలను ప్రజల పండుగగా మార్చాలని ఎమ్మెల్యే కూనంనేని దిశానిర్ధేశం చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు,కార్యకర్తలు పాల్గొన్నారు.