సాక్షి డిజిటల్ న్యూస్ 29అక్టోబర్ ఏన్కూర్ రిపోర్టర్ గుగులోత్ మజిలాల్ ఏన్కూర్ మండల పరిధిలోని జన్నారం గ్రామం మరియు అంజనాపురం గ్రామాల మధ్య నుండి ప్రవహిస్తున్న నిమ్మవాగు లో డీసిఎం లారీ కొట్టుకుపోయిన ఘటన కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా, అశ్వారావు పేటకు చెందిన డ్రైవర్, డీసిఎం లారీ ని పల్లిపాడు – ఏన్కూర్ మార్గం మధ్యలో ఉన్న నిమ్మవాగు బ్రిడ్జి వద్ద ఉదృతంగా వరద ప్రవహిస్తున్న కూడా బ్రిడ్జిని దాటించే ప్రయత్నం చేశాడు. స్థానికులు వెళ్ళవద్దు అని వారించిన కూడా లెక్కచేయకుండా ముందుకు వెళ్ళాడు, వరద ఉదృతి పెరిగి వాగులో కొట్టుకుపోయింది. డ్రైవర్ కూడా బయటికి రాలేక లారీలోనే చిక్కుకుపోయాడు. NDRF బృందానికి సమాచారం అందించగా వారు సుమారు 4 గంటల పాటు తీవ్రంగా శ్రమించి గాలింపు చర్యలు చేపట్టిన ఫలితం దక్కలేదు. వర్షం పడడం, వరద ఉదృతి పెరగడతో పాటు, చీకటి పడడం తో గాలింపు చర్యలు నిలిపివేసినట్టు తెలియజేశారు. తిరిగి రేపు గాలింపు చర్యలు చేపట్టే అవకాశం ఉంది.