నూతన పోస్ట్ ఆఫీస్ ను ప్రారంభించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

సాక్షి డిజిటల్ న్యూస్: అక్టోబర్29 రిపోర్టర్: జుక్కల్ నియోజకవర్గం ఇంచార్జ్: దత్తు కామారెడ్డి జిల్లా, పెద్ద కొడప్గల్ మండలంలోని, బూర్గుపల్లి గ్రామంలో నూతన పోస్ట్ ఆఫీస్ జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోస్ట్ ఆఫీస్ ల ద్వారా ఉత్తరాలు , పార్సిలను పంపడం మరియు స్వీకరించడం, డబ్బును బదిలీ సేవలు, పొదుపు ఖాతాలు, బీమా పథకాలు మరియు బిల్లులు చెల్లింపులు వంటి అనేక రకాల సేవలను అందిస్తున్నారని తెలిపారు.పోస్ట్ ఆఫీసులో అందిస్తున్న సేవలను ఉపయోగించుకోవడానికి ప్రజలకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *