ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేసేంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం పైన పోరాటంను కొనసాగిస్తాం.

*హలో విద్యార్థి-చలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం భారీ విజయవంతం మరియు విద్యార్థి గళం పెను ఉప్పెన

సాక్షి డిజిటల్ న్యూస్ అక్టోబర్ 30 2025 రిపోర్టర్ రాజు గద్వాల జిల్లా, ఈరోజు బిఆర్ఎస్వీ రాష్ట్ర పిలుపు మేరకు బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో చేపట్టిన హలో విద్యార్థి-చలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ను 500 పైగా విద్యార్థులతో గద్వాల కలెక్టరేట్ కార్యాలయంను ముట్టడి చేయడం జరిగింది. అనంతరం కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది.బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకునే ప్రైవేట్ కాలేజీలకు ఇంతవరకు ఫీజు బకాయిలు చెల్లించకపోవడం దుర్మార్గం. దీనివల్ల ఈరోజు రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీలు మూతపడడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారే పరిస్థితి ఉంది అని అన్నారు. విద్యార్థులకు 5 లక్షల విద్య భరోసా కార్డు ఇస్తానని మోసం. విద్యారంగానికి 15% బడ్జెట్ కేటాయిస్తానీ మోసం. 18 ఏళ్లకు పైబడిన చదువుకుంటున్న విద్యార్థినిలకు స్కూటీలు ఇస్తానని మోసం. నిరుద్యోగులకు 4 వేల నిరుద్యోగ భృతి ఇస్తానని మోసం. సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని మోసం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *