మద్యపానం మహమ్మారికి బలవుతున్న యువకులు

*ప్రజల ఆరోగ్యంతో కోట్లు ఘటిస్తున్న మద్యం సిండికేట్ బెల్ట్ షాపుల కేటుగాళ్లు *మద్యం అధిక ధరల అమ్మకాల మీద మండి పడ్డ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు బొక్కా వినేష్ మాదిగ

సాక్షి డిజిటల్ న్యూస్ అక్టోబర్ 30 భద్రాచలం రిపోర్టర్ గడ్డం సుధాకర్ రావు; పేసా యాక్ట్ ఉన్న భద్రాచలంలో ఆదివాసులకు మాత్రమే ఇవ్వవలసిన మద్యం దుకాణాలను దళారీలు ఆదివాసులను బినామీలుగా పెట్టుకొని మద్యం దుకాణాల టెండర్లను సాధించుకొని మద్యం అమ్మకాలు జరుపుతున్నారు ఇక సిండికేట్ ఆగడాలు వర్ణనాతీతం బెల్ట్ షాపులను ఆసరాగా తీసుకుని సిండికేట్ చేసే దోపిడీని ఎవరు ఎదిరించి మాట్లాడకుండా ఉండటంవల్ల అధిక ధరలకు మద్యం విక్రయించి యువతను మద్యానికి బానిసలు చేస్తూ వారి కుటుంబాలను రోడ్లమీద పడటానికి కారణం అవుతున్నాయి వీటిని అరికట్టాలని సంబంధిత అధికారులకు పలుమార్లు అర్జీ చేసిన ఎటువంటి స్పందన చూపకపోవడం చర్చనీయాంశం ఇకనైనా అధికారులు స్పందించి ఇటువంటి మద్యం షాపుల లైసెన్సులను వారి పేర్ల మీద ఉన్నాయే లేదో తెలుసుకొని వాటిని సీజ్ చేయాల్సిందిగా మరియు విరివిగా పెరిగిపోతున్న బెల్ట్ షాపులను తక్షణమే మూసివేసి సిండికేట్ ని కూడా సీజ్ చేయాల్సిందిగా భద్రాచలం ఎమ్మార్పీఎస్ మండల కమిటీ మరియు మండల అధ్యక్షులు బొక్క వినేష్ మాదిగ డిమాండ్ చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *