అక్టోబర్ 30, సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ జగన్, సత్తుపల్లి నియోజకవర్గం వేంసూరు మండల పరిధిలోని మర్లపాడు గ్రామంలో విద్యుత్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంను ఉద్దేసించి ఏఈ అంకారావు మాట్లాడుతూ చలరేగిన మొంథ తుఫాన్ వల్ల కురుస్తున్న వర్షం కారణంగా విద్యుత్ తీగలు తెగి పడే ప్రమాదం ఉంటుంది. అలాగే తడిసిన తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలకు దగ్గరగా ప్రజలు ఎవరూ వెళ్లవద్దని తెలియజేసారు. అదేవిదంగా నీటిలో నిలబడి ఎలక్ట్రిక్ పరికరాలు వాడవద్దు. తడిచిన చేతులతో స్విచ్లు వేయవద్దని అంటూ, ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అలాగే ఎక్కడైనా తీగలు పడినట్లు కనిపిస్తే వెంటనే విద్యుత్ శాఖ సిబ్బందికి, డయల్ 1912కి తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.