ముదిరాజులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటాలి

సాక్షి డిజిటల్ న్యూస్, అక్టోబర్ 30, మల్లాపూర్ మండల రిపోర్టర్ ఆకుతోట నర్సయ్య : ముదిరాజ్ లు పార్టీలకు అతీతంగా ఐక్యతగా ఉండి అన్ని రంగాలలో ముందుకెళ్లాలని, రాజ్యాధికార వాటా కోసం పోరాడాలి అని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో వార్డు నెంబర్ స్థాయి నుండి జెడ్పిటిసి స్థాయి వరకు ముదిరాజులు పోటీ చేసి తమ సత్తా చాటాలని ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షులు చిట్యాల లక్ష్మణ్ అన్నారు. బుధవారం ముదిరాజ్ మహాసభ గౌరవ జిల్లా అధ్యక్షులు డా.సత్యనారాయణ అదే ఆదేశాల మేరకు మల్లాపూర్ మండలం లోని వాల్గొండ, పాత దామరాజ్ పల్లి, కొత్త దామరాజ్ పల్లి ,ఓబులాపూర్, మొగిలిపేట్ గ్రామాలలోని ముదిరాజ్ సంఘాలతో ఆయన సమావేశాలను నిర్వహించి ముదిరాజులను చైతన్య పరిచారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ మండల అధ్యక్షులు చిట్యాల లక్ష్మణ్ , ఉపాధ్యక్షులు బోయిని హన్మాండ్లు, ప్రధాన కార్యదర్శి దండవేని రాజేందర్, ఉస్కెల చిన్నయ్య మరియు పల్లి మధు ,బోండ్ల రవి, వివిధ గ్రామాల ముదిరాజ్ సంఘం పెద్దమనుషులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *