జనం న్యూస్ 01/05/2026, నంద్యాల టౌన్ రిపోర్టర్ కోనేటి వెంకటేశ్వర్లు పదవ తరగతి పరిక్షా ఫలితాలలో మా నంద్యాల నారాయణ పాఠశాల విద్యార్తులు అద్భుత ప్రతిభ కనబరిచి 100% ఉత్తీర్ణత సాధించిన మరియు గరిష్టంగా 597 మార్కులు సాధించి ప్రథమ స్థానాన్ని పొందారు. అదే విధంగా 596, 595, 594,593, 592, 591, మార్కులు మరియు 590 పైన మార్కులు సాధించిన వారు 7 మంది ఉండడం గర్వించ దగ్గ విషయం.
అదే విధంగా 580కి పైగా 20 మంది, 550 కి పైగా 57 మంది, 540 కి పైగా 67 మంది, 500 లకు పైగా 92 మంది విద్యార్థులు మార్కులు సాధించారు. మొత్తం విద్యార్థులు సగటు మార్కులు 530 గా నమోదయ్యాయి. అదే విధంగా మొత్తం 116 మంది విద్యార్థులు పరిక్షకు హాజరు కాగా తెలుగులో 84 మంది, హిందీలో 59 మంది, ఇంగ్లీషులు 62 మంది, మాథ్స్ లో 15 మంది, సైన్స్ 52 మంది, సోషల్ లో 90 మంది, 90 మార్కులకు పైగా సాధించడం జరిగింది. మరియు 60% మంది విద్యార్థులు 90% పైగా మార్కులు సాధించారు. ఈ ఫలితాలు మా పాఠశాలలోని నాణ్యమైన బోధన, ఉపాధ్యాయుల కృషి మరియు ఉపాధ్యాయులు, కృషి మరియు విద్యార్థుల కఠిన శ్రమకు నిదర్శనం పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు తల్లితండ్రులు అందరూ ఈ విజయానికి కారణమయ్యారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరచిన విద్యార్థులను నంద్యాల నారాయణ విద్యా సంస్థల AGM ప్రశాంత్ , RI చంద్ర మౌళిశ్వర్ రెడ్డి, ప్రిన్సిపల్స్ రవీంద్ర, మరియు అంజనిదేవి అభినందించారు. మరియు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
