జనంన్యూస్ మే 01 ఎలిగేడు మండలం గురువారము రోజున ర్యాకల్ దేవ్ పల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యములో గ్రామ సర్పంచ్ మద్ధెల రమాదేవి సంపత్ గ్రామంలో వరి ధాన్య కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా సర్పంచ్ రమాదేవి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం రైతుల బాగుకోసం కృషి చేస్తుంది అన్నారు రైతులు ఆరుగాలం కష్ట పడి పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏలాంటి కటింగ్ లు లేకుండా కొనుగోలు చేస్తుంది అని తెలిపారు 17 శాతం వరకు మ్యాచర్ వచ్ఛిన ధాన్యాన్ని తూకం వేసి వెంటనే మిల్లులకు తరలించాలి అన్నారు. ఈ కార్యక్రమములో కాంగ్రేస్ పార్టీ మండల అధ్యక్షులు సామ రాజేశ్వర రెడ్డి ,కాంగ్రేస్ రాష్ట్ర యూత్ నాయకులు సంతోష్ రావు ,ఉప సర్పంచ్ బొడిగె శివకృష్ణ గౌడ్ ,మండలం లోని వివిధ గ్రామాలకు చెందిన మాజీ సర్పంచ్ లు ,మాజీ ఉప సర్పంచ్ లు రైతులు తదితరులు ఉన్నారు