రెండు బైకులు ఢీ ఒకరు మృతి

జనం న్యూస్ మే 01 ముద్దనూరు : ముద్దనూరు మండలం కాండ్లోపల్లె,వేల్పుచర్ల మధ్యలో ఎదురు ఎదురుగా రెండు బైకులు ఢీ కొన్నాయి ముద్దనూరు పట్టణానికి చెందిన షేక్ దాదాకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే అంబులెన్స్ కు సమాచారం ఇవ్వగా సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.చికిత్స పొందుతు షేక్ దాదా మరణించాడు.