రుద్రూర్, ఏప్రిల్ 30 (అక్షర ఆయుధం న్యూస్) : సిరిపూర్ నుండి మోస్రా వైపు వెళ్తున్న TS 21 L 9222 బ్రిజా కారు రుద్రూర్ మండల కేంద్రంలోని కోటగిరి గ్రామానికి వెళ్లే బ్రిడ్జి వద్ద బుధవారం రాత్రి ఎదురుగా వస్తున్న పందిని ఢీ కొట్టడంతో బోల్తా పడింది. కారులో ఉన్న విట్టం పేట్ గ్రామానికి చెందిన డ్రైవర్ కారంగుల మహర్షి (30), ఏరాజ్ పల్లి గ్రామానికి చెందిన పోతురాజు చిన్న హన్మాండ్లు (38) లకు తీవ్ర గాయాలు కాగా స్థానికులు వెంటనే 108 అంబులెన్సులో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న ఎస్సై సాయన్న తన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.