బాలల, మహిళల భద్రత మరియు, డ్రగ్స్, బాల్య వివాహల నిర్ములన అంశం పై అవగాహనా కార్యక్రమం

జనం న్యూస్ 30 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 99 రోజుల కార్యాచరణ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గద్వాల జిల్లా గోనుపాడు పోలిటెక్నిక్ కళాశాలలో బుధవారం ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు బాలల, మహిళల భద్రత మరియు ,డ్రగ్స్, బాల్య వివాహల నిర్ములన అంశం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.యువత క్రమశిక్షణ తో నడుచుకుంటేనే ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని, అలాగే దేశ భవిష్యత్ ను నిర్ణహించే నేటి యువత డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అన్నారు. బాల్యవివాహల వల్ల బాలికలు మంచి భవిష్యత్తు ను కోల్పోవడం తో పాటు అనారోగ్యం పాలు అవుతారని, బాలల సంక్షేమన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలు బాలలకు పౌష్టిక ఆహారం అందించడం తోపాటు విద్య, వైద్య సదుపాయాలు కల్పిస్తుందని వాటిని సద్వినియోగం చేసుకొని మంచి భవిష్యత్తు ను నిర్మించుకోవాలని, జీవితంలో సెటిల్ అయ్యాకే పెళ్లి గురించి ఆలోచించాలని బాలికలకు సూచించారు.యువత తమ చుట్టూ బాల్యవివాహాలు జరిగితే పోలీస్ వారికీ సమాచారం ఇవ్వడం తో పాటు వాటిని అడ్డుకొని తల్లి తండ్రులను చైతన్యం చెయ్యాలని అన్నారు యువత విద్య అంటే ఉద్యోగం, డబ్బు సంపాదించడం ఒక్కటే కాదని తాము చైతన్యం అవుతూ సమాజంను చైతన్య పరచాలని అన్నారు. లక్ష్య సాధనను ముందుగా నిర్ణహించుకొని ప్రణాళిక బద్దంగా ముందుకు సాగాలని అన్నారు. ఏ స్థాయి కి వెళ్ళిన అందుకు కారణం అయినా గురువులను మరువకూడదని అన్నారు సమాజాన్ని పట్టి పిడుస్తున్న డ్రగ్స్ నిర్ములన ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. మత్తు పదార్థాలు ముందు ఒక అలవాటు గా వాడకం మొదలు అయి అవి దొరకక పోయిన, వినియోగించక పోయిన ఆరోగ్యం క్షినించి అవి లేకపోతే జీవించలేని స్థాయికి వెళ్ళిపోతామనీ, డ్రగ్స్ వల్ల నర్వస్ సిస్టం నాశనం అయి ఆరోగ్యం క్షినిస్తుందని, దేశ భవిష్యత్ ను నిర్ణహించే నేటి యువత అలాంటి వ్యాసనాలకు దూరంగా ఉండాలని అన్నారు. దేశ భవిష్యత్ యువత చేతులలో ఉందని, క్రమశిక్షణ తో మేలుగుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరు భవిష్యత్ లోను డ్రగ్స్ కు దూరంగా ఉంటామని గట్టిగ నిర్ణహించుకోవాలని తెలియజేస్తూ సెల్ఫీ ఫోటో దిగడం జరిగింది.ఈ కార్యక్రమంలో డి డబ్ల్యు ఓ అధికారి సునంద పోలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ రామ్ మోహన్ రావు, వైద్య అధికారి ప్రదీప్ డి సి పి ఓ నరసింహ,అబ్కారి శాఖ ఎస్సై లు కృష్ణ, వెంకటేష్,రూరల్ ఎస్సై శ్రీకాంత్, కళాశాల స్టాఫ్ మరియు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.