జనం న్యూస్ మే 01 ప్రతినిది ఎండీ జహంగీర్, బిజినపల్లి మండల పరిధిలోని పాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పదవి విరమణ పొందిన ఆప్తాలమిక్ అధికారి వీరమల్ల వెంకటస్వామి గారికి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎం.ప్రియాంక రిటైర్మెంట్ ధ్రువ పత్రాన్ని గురువారం నాడు అందజేశారు.గత 38 సంవత్సరాలుగా కంటి విభాగంలో చేసిన సేవలను పలువురు కొనియాడారు.వీరమల్ల వెంకటస్వామి మొదటగా వీపనగండ్లలో ఉద్యోగం పొంది,చివరగాపాలెం లో పదవి విరమణ పొందడం విశేషమని అన్నారు. ఆయనను శాలువలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు.శేష జీవితం ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, కుటుంబ పరివార సమేతంగా జీవించాలని కోరారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ ఈ. సత్యలక్ష్మి,పారామెడికల్ అధికారి వెంకటయ్య,హెడ్ నర్స్ ఎలీషా,ఆరోగ్య పర్యవేక్షకులు కే.సుజాత,సిబ్బంది వెంకటేష్,మధు,చందు లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.