పాడేరులో రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంట్తేదీ 1-5-2026 నుండి 05-05-2026 వరకు రుసుముతో పేర్లను నమోదు చేసుకోవాలి

జనం న్యూస్ మే 1( కొయ్యూరు రిపోర్టర్ కృష్ణ) అల్లూరి జిల్లా పాడేరులో మే 17,18,19తేదీల్లో అత్యంత వైభవంగా జరిగే శ్రీ శ్రీ శ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను పురస్కరించుకుని,08-05-2 026నుండి 11-05-2 026వరకు రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు కృష్ణ, మహేష్, కోటి, కేశవ,రాజేష్ ఒక ప్రకటనలో తెలిపారు.టీడీపీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే, ఉత్సవ కమిటీ అధ్యక్షురాలు గిడ్డి ఈశ్వరి ఆదేశాల మేరకు, ఆదివాసి విలేకరుల పరిరక్షణ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ క్రీడా పోటీలు జరగనున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రతిభావంతులైన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనాలని వారు కోరారు.ఈ టోర్నమెంట్‌లో పాల్గొనదలచిన జట్లు తేదీ 01-05-2026 నుండి 05-05-2026వరకు ప్రవేశ రుసుము రూ.1500 చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకోవాలి.ఆసక్తి గల క్రీడాకారులు ఇతర వివరాల కోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరు.కృష్ణ 7816096932,మహేష్ 93908 24178,కోటి 94936 54263 మోదకొండమ్మ ఉత్సవాల సందర్భంగా నిర్వహించే ఈ భారీ క్రీడా వేడుకను విజయవంతం చేయాలని ఆదివాసి విలేకరుల పరిరక్షణ సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు మహేష్ కార్యదర్శి కృష్ణారావు ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.