పదవ తరగతి ఫలితాల్లో విజయ దుందుభి మ్రోగించిన జేమ్స్ పాఠశాల విద్యార్థులు.

జనం న్యూస్ ఏప్రిల్ 30 జనం న్యూస్ ప్రతినిధి నండ్రు సుందర్ రావు. గురువారం రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన పదవ తరగతి ఫలితాల్లో జేమ్స్ పాఠశాల విద్యార్థుల విద్యార్థులు నందిగామ మండలంలోని అత్యధిక మార్కులు సాధించి జిల్లా ర్యాంకులు సాధించడం జరిగింది. జేమ్స్ పాఠశాల నుండి 24 మంది విద్యార్థులు పరీక్ష హాజరుకాగా 24 మంది విద్యార్థులు పాస్ అయ్యే 100% ఫలితాలను సాధించడం జరిగింది. జేమ్స్ పాఠశాల తరఫున ఎస్.కె సంథింగ్ 600 మార్కులకు గాను 584 సాధించి జిల్లా ర్యాంకులు సాధించారు మా పాఠశాలలో ప్రథమ స్థానాన్ని సాధించిన మా విద్యార్థి సమ్రీన్. కే సింధు 600 మార్కులకు గాను 578 మార్కులు సాధించి ద్వితీయ స్థానాన్ని సాధించారు అదేవిధంగా జీ నికిత 600 మార్కులకు గాను 575 మార్కులు సాధించి తృతీయ స్థానాన్ని సాధించారు మా పాఠశాలలో 500 మార్కులు సాధించిన విద్యార్థులు 70% విద్యార్థులు ఆ మార్కులు సాధించారు ముఖ్యంగా మాతృభాష విభాగంలో 100 మార్కులకు 100 మార్కులు సాధించి నందుకు పాఠశాల తరఫున ఆ విద్యార్థిని ని మాతృభాష ఉపాధ్యాయుడు నండ్రు సుందర్ రావు ప్రత్యేకంగా అభినందించారు ఈ విధంగా అత్యుత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థిని విద్యార్థులు అందర్నీ పాఠశాల ప్రిన్సిపాల్ మరియు పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు మరియు బోధ నేతర సిబ్బంది అందరూ అభినందించారు.