పదవ తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిది బాలికలే

జనం న్యూస్ మే 1 ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం, పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో బాలికలే పై చేయి సాధించారు. పబ్లిక్ పరీక్షల్లో బాల బాలికలు 143 మంది పరీక్ష రాయగా గురువారం ప్రకటించిన ఫలితాలలో 118 మంది (83 శాతం) ఉత్తీర్ణ సాధించారు .వీరిలో బాలికలే ముందంజలో అధిక మార్కులు సాధించారు. శివకాశిపురం ఆశ్రమ బాలికల పాఠశాలకు చెందిన తెల్లం హర్షిత 560 మార్కులతో మండల ప్రథమ స్థానం సాధించిందని, భూదేవిపేట కస్తూరిబా గాంధీ విద్యాలయానికి చెందిన పేరుమళ్ళ వైష్ణవి 546 మార్కులతో ద్వితీయ స్థానం సాధించారని మండల విద్యాశాఖ అధికారి కే శ్రీనివాసరావు, హెచ్ఎం వి వి సత్యనారాయణ తెలిపారు.